27-10-2025 10:41:29 AM
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో(Tandur Mata Sisu Hospital ) వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.బాధ్యత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోటపల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత (24) రెండవ కాన్పు కోసం గత ఆదివారం వచ్చింది. గత రాత్రి ప్రసవం కావడంతో శిశువు, తల్లి క్షేమంగానే ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ బాలింత రజిత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు టీకా ఇచ్చారు.
ఆమె పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్ నగరానికి తీసుకు వెళ్లాలంటే వైద్యులు కుటుంబ సభ్యులతో సంతకాలు తీసుకున్నారు. అయితే సంతకాలు తీసుకునే సమయానికే రజిత మృతి చెందిందని ...అందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. కాన్పు పూర్తయి 6 గంటల తర్వాత బాలింత మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెండో కాన్పులో పాపకు జన్మనిచ్చి ఆరు గంటల తర్వాత మృతి చెందడం పై బంధువుల ఆందోళన వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందంటూ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు