24-04-2025 12:49:40 AM
ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతి
ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా 2024 సంవత్సరం గాను నిర్వహించిన యుపిఎస్సి ఫలితాల్లో 1009 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం, అందులో 109 మంది ఈడబ్ల్యూఎస్ కు చెందిన అభ్యర్థులు ఉన్నతమైన ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల ఈ డబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు తాడిశెట్టి పశుపతి హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం హిమాయత్ నగర్ అసోసియేషన్ కార్యాలయంలో అవు ను మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన పోరాటాల ఫలితంగా అగ్రకుల సామాజిక వర్గాల్లోని పేద నిరుద్యోగుల కోసం బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ బద్ధంగా 10 శాతం ఈ డబ్ల్యూఎస్ రేషన్లు కల్పించారని చెప్పారు.
దీంతో దేశవ్యాప్తంగా దశాబ్దాల నుండి రిజర్వేషన్లు పొందని వారు ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా వేలాది మంది నిరుద్యోగులు విద్య, ఉద్యోగాలు పొంది వారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పరుచుకుంటున్నారని తెలిపారు. ఈ రిజర్వేషన్లతో లబ్ధి పొందుతున్న అగ్రవర్ణ పేదలు ప్రధాని మోదీకి జీవిత కాలం కృతజ్ఞతగ ఉంటారని పేర్కొన్నారు.
అదే విధంగా సివిల్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పేద ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు తాడిశెట్టి ప్రతిమ, కర్ర రాకేష్, తిరుపతయ్య, పి శ్రీనివాస్, ప్రవీన. వైష్ణవి, పూజరాజ్ సముద్రాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.