24-04-2025 12:49:27 AM
మునిపల్లి, ఏప్రిల్ 23 : బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన,పేదల భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసమే భూభారతి చట్టమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం నాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హాజరై మాట్లాడారు.
నూతన భూ చట్టంతో భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని, రైతులు భూ యజమానులు ఏవైనా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ధరణిలో లేదని, ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంలో సమస్యలు, అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ గంగా భవాని, ఎంపీడీఓ హరినందన్ రావు, ఏవో అనితరెడ్డి, ఎంఈఓ భీంసింగ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రైతులుపాల్గొన్నారు.