calender_icon.png 4 May, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే

24-04-2025 12:50:54 AM

 రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్దాం : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఈ నెల 27న వరంగల్లో జరుగనున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అందరం ఒక్కటై కదిలి భారీగా తరలివెళ్లి విజయవంతం చేద్దాం అని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం శేర్లింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్‌ఎస్ నాయకులు, కార్పొరేటర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలనను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో ఎంతోమంది నిరుపేదలకు సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందామో రైతులకు జరిగిన మేలు  వివరించి ప్రజలకు తెలిసేలా చేయాలని, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చేటట్లు వారికి గత ప్రభుత్వ పరిపాలన విధానాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలపాలని సూచించారు.

అలాగే సభకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు, భోజన సదుపాయం నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి చూసుకోవాలన్నారు. ఎండలు తీవ్రత అధికంగా ఉండటం వల్ల మంచినీటి సదుపాయంకు అంతరాయం కలగకుండా ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తనకి ఫోన్ చేయాలని తెలిపారు. ఈ రజతోత్సవ వేడుకలను ఒక పండగ వాతావరణం గా చేసుకోవాలని ఎంతో కష్టపడి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. గత పది ఏళ్లుగా ఎంతో అభివృద్ధి చేసుకున్న రాష్ట్రం నేడు వ్యాపారాలు లేక చెరువులు, ప్రాజెక్టులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయి అటు రైతులకు ఇటు ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.