4 May, 2026 | 12:26 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

బాధ్యతగా ఓటు హక్కును వినియోగించండి

08-12-2025 05:30 PM

మంచిర్యాల డీసీపీ భాస్కర్..

దండేపల్లి (విజయక్రాంతి): స్వేచ్ఛగా, భయం లేకుండా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కాసిపేట్, డండేపల్లి గ్రామాల్లోనీ సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ తో కలిసి సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఎలాంటి ఒత్తిడులు, బెదిరింపులు లేకుండా మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు.

గ్రామాల్లో ఎవరికైనా ఎన్నికల ప్రచారం చేయడానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుందని శాంతియుత వాతావరణంలో పారదర్శక ఎన్నికల కోసం తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, భద్రత, సరైన బారి కేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందేది ఓటు హక్కుతోనేనని, అందరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించూకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్ఐ తైహిసినోద్దీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.