calender_icon.png 8 December, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్

08-12-2025 05:34:05 PM

తాండూరు (విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్. సోమవారం పట్టణం 33వ వార్డుకు చెందిన పతంగి నాగమణి అకాల మరణం చెందిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అంతక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు. అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం అందించి నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న డాక్టర్ సంపత్ కుమార్ కు మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.