08-12-2025 05:28:13 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ..
కోనరావుపేట (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోనరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలించి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంను సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా తహసీల్ కార్యాలయానికి చేరుకొని భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులపై ఆరా తీశారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన.
కోనరావుపేట మండలం మల్కపేట, కోనరావుపేట, నిజామాబాద్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపు తదితర అంశాలపై ఆరా తీశారు. పరిశీలనలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.