25 April, 2026 | 2:07 AM

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి

25-04-2026 12:29 AM

కోహెడ, ఏప్రిల్ 24: వరి ధాన్యాన్ని వేగవంతం గా కొనుగోలు చేయాలని..  సిద్దిపేట సివిల్ సప్లై డిఎం గోపికృష్ణ అన్నారు. శనిగరం, కోహెడ, గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని  రైతులకు నీడ, నీళ్లు మౌలిక వసతులు కల్పించాలని ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ గౌడ్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విద్యాసాగర్, ఐకెపి సీసీలు సంపత్, రాజమౌళి, శ్రీనివాస్, సుల్తానా, అధ్యక్షురాలు మంజుల విఏఓ లు సునీత, పుష్ప, రైతులు పాల్గొన్నారు.