7 May, 2026 | 7:47 AM

పేలిన ఈవీ బైక్ బ్యాటరీ

28-11-2024 12:52 AM

తొమ్మిది బైక్‌లు దగ్ధం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి, ఆ వాహనంతో పాటు మరో ఎనిమిది బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన వివేక్‌నగర్‌లో ఓ ఇంటి ఆవరణలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ వివేక్‌నగర్‌లోని ఓ ఇంటి ఆవరణలో తొమ్మిది బైక్‌లు నిలిపిఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి మంటలు అంటుకుని, ఆ బైక్‌తో పాటు మరో ఎనిమిది బైక్‌లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటానా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.