7 May, 2026 | 6:43 AM

నిన్న గృహప్రవేశం.. నేడు అగ్నిప్రమాదం

28-11-2024 12:54 AM

రాజేంద్రనగర్, నవంబర్ 27: రంగారెడ్డి జిల్లా పరిధిలోని మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్ర మాదం చోటచేసుకున్నది. గృహ ప్రవేశ వేడుక జరిగిన మర్నాడే ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ కుటుంబం పుప్పాలగూడలోని ఈఐపీఎల్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో మంగళ వారం గృహప్రవేశం చేసింది. బుధవారం ఫ్లాట్‌లోని పూజగదిలో మంటలు అంటుకున్నాయి.

మంట లు క్రమంగా ఫ్లాట్‌ను కమ్మేశాయి. దీంతో కుటుంబ సభ్యులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నార్సింగి పోలీసులు అపార్ట్ మెంట్‌కు చేరుకుని, అగ్నిప్రమాదంపై బాధిత కుటుంబాన్ని విచారించారు.