15 June, 2026 | 2:01 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

పూజల పేరుతో దోపిడీ

10-02-2026 12:52 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి9 (విజయ క్రాంతి): పూజల పేర నమ్మించి ఓ వృద్దుని వద్ద పూజల పేరుతో బంగారు ఉంగరాన్ని దొంగిలించి పరారైన ముగ్గురు నిందితులను వారాసిగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న లలితానగర్లోని జామియా ఉస్మానియా రైల్వే స్టేష న్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు  ఓ వృద్దుడి వద్దకు వచ్చారు.

పూజలు చేస్తామని నమ్మించి వృద్ధుడి వద్ద ఉన్న అర తులం బంగారు ఉంగరాన్ని తీసుకున్నారు. అందులో ఒక  నిందితుడు ఉంగరాన్ని మిం గేసి, బయట ఆటోలో సిద్ధంగా ఉన్న మరో నిందితుడి తో కలిసి పరారయ్యాడు. దీంతో తాను మోసపోయాయనని గుర్తించిన వృద్దులు వారాసిగూడ పోలీసు స్టేషన్ కు వచ్చి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మధ్యప్రదేశ్కు చెందిన నిందితులు సుభాష్ నాథ్ (23), కరణ్ నాథ్(21), సోహన్ నాథ్ (23) అరెస్టు చేశారు.