26 August, 2026 | 3:44 AM

ప్రశ్నిస్తే కేసులా?

26-08-2026 12:59 AM

కేసులు ఉన్న వ్యక్తితో పని చేయలేం 

కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి 

రంగారెడ్డి, ఆగస్టు 25: కష్టపడి పని చేసే వారికి పదవులు ఇస్తామని చెప్పి... కేసులు ఉన్న వ్యక్తికి ఎలా పదవి ఇస్తారని ప్రశ్నిస్తే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కాంగ్రెస్ నాయకురాలు కొత్త విద్యారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాహెబ్ నగర్ లో మంగళవారం ఆమె తన నివాసంలో మాట్లాడారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించానే తప్పా, నేను ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా కులపరంగా దూషించ లేదన్నారు.

కులం పేరుతో దూషించినట్లు నిరూపిస్తే ప్రాణ త్యాగం చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సా హెబ్ నగర్ డివిజన్  అధ్యక్షుడు రమేశ్ నా యక్ గతంలో ఒక కేసులో పట్టుబడింది నిజ ం కాదా?, ఎల్బీనగర్ లో మసాజ్ సెంటర్లు నిర్వహిస్తుంది నిజం కాదా? అని నిలదీశారు. బ్రోతల్ కేసు ఆరోపణలు వచ్చిన త ర్వాత కూడా రమేశ్ నాయక్ తో కలిసి మధుయాష్కీగౌడ్ తిరగడంలో ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు.

ఎవరినైనా ప్రశ్నిస్తే మధుయాష్కీగౌడ్ ప్రోద్బలంతో ప్రశ్నించినవారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించడం సిగ్గుచేటని, ఇది ఎంతవరకు న్యాయమన్నారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించడంపై న్యాయపరమైన పోరాటం చేస్తానన్నారు. ఎల్బీనగర్లో పార్టీ కోసం పనిచేస్తున్న పాత, సీనియర్ నాయకుల సమస్యలనే తాను ప్రస్తావించానని వెల్లడించారు. ఏ కులాన్ని గానీ.. ఏ వ్యక్తిని గానీ విమర్శించలేదని స్పష్టం చేశారు. కేసులు ఉన్న వ్యక్తితో పని చేయలేమని, ఈ నేపథ్యంలోనే తాను పార్టీ పెద్దలను ప్రశ్నించినట్లు విద్యారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాల్గొన్నారు.