పోరాటాల పార్టీ సీపీఐకి చేయూతనివ్వండి
పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 1 : భూమికోసం భుక్తి కోసం పేద ప్రజలను అండగా నిలిచిన పార్టీయే సిపిఐ అని ఆ పార్టీకి ప్రజలు చేయూతనివ్వాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు అన్నారు. బుధవారం మండలంలోని చిన్న కందుకూరు గ్రామంలో ఇంటింటికి సిపిఐ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేరబోయిన మహేందర్ తో కలిసి పాల్గొని మాట్లాడారు.
భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో, మతోన్మాద మరియు కార్పొరేట్ కబంధహస్తాల నుండి దేశాన్ని విముక్తి చేసి సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, అమరవీరుల రక్త త్యా గాలతో ఎన్నో విజయాలు సాధించి, భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సం పాదించుకున్న పార్టీ సిపిఐ అని తెలిపారు.
నిరంకుశ నిజాం పాలనను గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగంతో 3000 గ్రామాలను విముక్తి చేసి, దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనమైన చరిత్ర సిపిఐదని గుర్తుచేశారు.
భవి ష్యత్తులో ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ కి అన్ని వర్గాల ప్రజలు హార్దిక సహకారం అందించి ప్రజా ఉద్యమాల నిర్మాణానికి తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కలిపెల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, పేరబోయిన పెంటయ్య, ఉపసర్పంచ్ కాటం శ్రీకాంత్, నమిల సంజీవ, తుమ్మల ఉపేందర్, రాకల మహేందర్, రేఖల మల్లుస్వామి, కలిపెల్లి శ్రీశైలం, కాటం బాలయ్య, గడ్డం నర్సయ్య, రమేష్ పాల్గొన్నారు.




