బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త జొన్నలగడ్డ
02-04-2026 12:00 AM
ఆహ్వానించిన రాంచందర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ప్రముఖ పారిశ్రామికవేత్త జొన్నలగడ్డ శైలజ బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ లో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆహ్వానించారు. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితులై, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములయ్యేం దుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మోదీ నా యకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేస్తూ, బీజేపీ కుటుంబంలోకి అడుగుపెట్టిన శైలజకు ఆయన హార్దిక స్వాగతం పలికారు.




