19 March, 2026 | 3:53 AM

ఎస్సీ ఓవర్సీస్ విద్యానిధి గడువు పెంపు

16-10-2024 02:02 AM

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఉపకార వేతనాల కోసం ఈ నెల 29 వరకు ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https:// tgepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.