30 June, 2026 | 2:55 PM

Breaking News

దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ పొడిగింపు

20-06-2025 01:18 AM

కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్

కామారెడ్డి, జూన్ 19 (విజయ క్రాంతి), కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో  డిగ్రీ ప్రవేశాలు గురువారం చివరి రోజు కాగా ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో  వివిధ కోర్సుల్లో విద్యార్థులు ముమ్మరంగా ప్రవేశాలకు ఉత్సాహంగా పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.

కామారెడ్డి ప్రభుత్వడిగ్రీ కళాశాలలో  ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ  మూడవ దశ  గురువారం 19వ తేదీ  చివరి రోజు ఉండగా దీనిని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు  ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే విజయ్ కుమార్ తెలిపారు.  విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను మొదటి ప్రాధాన్యతగా  ఎంచుకోవాలని ఆయన కోరారు.