17 April, 2026 | 2:03 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

మెట్రో ఫేజ్‌వు అనుమతివ్వండి

20-06-2025 01:17 AM
  1. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతి
  2. ఇతర శాఖల నుంచి సత్వర అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో ఫేజ్-  సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ఖట్టర్‌తో ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్- అవసరం ఎంతో ఉందని సీఎం కేంద్రమంత్రికి వివరించారు. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. మెట్రో ఫేజ్‌d సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని..

సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.  పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్రమంత్రికి సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.