calender_icon.png 7 February, 2026 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

07-02-2026 04:30:19 PM

వేయి స్తంభాల గుడిలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

హనుమకొండ,(విజయక్రాంతి): రుద్రేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 14 నుండి 18 వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వరంగల్ జోన్ ఉప కమిషనర్ రామల సునీత పేర్కొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రచార కరపత్రమును ఆవిష్కరించే సందర్భంగా రామల సునీత మాట్లాడుతూ ఉత్సవాలకు విద్యుత్,మున్సిపల్, పోలీస్, ఆర్ అండ్ బి, కేంద్ర పురావస్తు శాఖ, సాంస్కృతిక శాఖ, మీడియాతో కలిసి సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు, ధర్మ దర్శనం క్యూ లైన్ లో వచ్చే భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని, భక్తులకు నీడ కోసం చలువ పందిల్లు, దేవాలయంకు వచ్చే భక్తులకు దాహార్తి తీర్చేసిందుకు మంచినీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రత్యేక రుద్రాభిషేకం క్యూ లైన్ లో వచ్చే భక్తులకు వైదిక సిబ్బంది పూజలు నిర్వహించాలని, విఐపి లైన్ ప్రత్యే కంగా ఏర్పాటు చేయాలని, ఐదు రోజులపాటు విద్యుత్ అలంకరణ ఘనంగా ఏర్పాటు చేయాలని, కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు తలంబ్రాలు అందించాలని, కళ్యాణ వేదిక ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ ను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో అనిల్ కుమార్ మాట్లాడుతూ అన్ని శాఖల వారికి సమాచారం ఇవ్వడం జరిగిందని, ఈనెల 10వ తేదీ నుండి ఉత్సవాలకు అన్ని ఏర్పాటు చేస్తామని, 13వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతా యని అన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు,శివరాత్రి జాగరణ ఉండే భక్తులకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్ర మాలు ఏర్పాటు చేస్తున్నామని, మంచినీరు సౌకర్యం, వాలంటరీస్ స్వచ్ఛంద సంస్థలతో ఏర్పాటు చేస్తున్నామని ఈవో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు గట్టు మహేష్ బాబు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర నాయకులు అయినవోలు వెంకట సత్య మోహన్, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకుడు గండ్రాతి రాజు, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు మామిడాల గణపతి, వెలమ సంఘం రాష్ట్ర నాయకులు గుజ్జ సంపత్ రావు, ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ పరిచా రకులు సందీప్ శర్మ, సిబ్బంది ఎన్.మధుకర్, ఎల్. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.