15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

మైనార్టీ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని వినతి పత్రం అందజేత

07-02-2026 04:26 PM

తరలిస్తామంటే పోరాటాలు చేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరిక

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షల ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం అసిస్టెంట్ సెక్రెటరీ కయీమ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... తుంగతుర్తి ప్రాంతంలో సరైన వసతులు లేవనే సాకుతో, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను వేరే ప్రాంతానికి తరలిస్తామంటే ఊరుకునేలేదని హెచ్చరించారు.

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి పాఠశాలకు నూతన ప్రభుత్వ భవనాన్ని మంజూరు చేయాలని సరైన వసతుల కోసం ప్రత్యేక నిధులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మల్లెపాక సాయిబాబా, తడకమళ్ళ రవికుమార్, గొపగాని రమేష్, నారాయణదాసు నాగరాజు, ఉప్పుల నాగమల్లు బొజ్జ సాయికిరణ్, సాయి కృష్ణ , మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.