గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల ఎక్స్ టర్నల్ ఆడిట్
గాంధారి, జూన్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గ్రామ సంఘాలు, మండల సమాఖ్య ల ఎక్స్ టర్నల్ ఆడిట్ నిర్వహించినట్టు ఐకెపి ఏపీఎం ప్రసన్న కుమార్ తెలిపారు. మండలంలోని 50 గ్రామ సంఘాలకు ఆడిట్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈ ఆడిట్ కార్యక్రమాన్ని ఎక్స్ టర్నల్ ఆడిటర్ కంపెనీ సురేష్ రెడ్డి, మరియు అసోసియేట్ ఆడిటర్లు నువెందెర్, మానస రెడ్డి, కృష్ణ, వినోద్, వెంకటేశ్వర్లు పర్యవేక్షించారని ఆయన తెలిపారు.
ఆడిట్ సందర్బంగా గ్రామ సంఘాల, మండల సమాఖ్యల ఆర్థిక లావాదేవీలు, రికార్డులు, పొడుపులు, రుణాల వివరాలు, సమావేశాల మినిట్స్ తదితర అంశాలను పరిశీలించారు. ఈ ఆడిట్ ద్వారా సంఘాల పనితీరులో పారదర్శకత, జవాబుదారీ తనం, ఆర్థిక క్రమశిక్షణ మరింత మెరుగుపడే అవకాశం ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పుష్పారాణి, డి.ఎం.జి. సంగమేశ్వర్ , సీసీలు రాములు, రాజయ్య,కాశీనాథ్, శేఖర్, సౌజన్య,రమేష్, అకౌంటెంట్ సుధాకర్, వి.ఓ.ఎ. లు గౌస్ ఖాన్, లక్ష్మీ దేవి, లక్ష్మీ ప్రియ, వనిత, ప్రియాంక, సవిత, స్వప్న, లావణ్య, కవిత, ప్రభావతి, గంగా విక్రమ్ పాల్గొన్నారు.






