13-01-2026 08:31:03 PM
మోతే,విజయ క్రాంతి: మండల పరిధిలోని విభళ్ళ పురం గ్రామంలో మంగళవారం అన్నారి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రైతుల నుంచి భూమి సేకరణ చేయడం ద్వారా పనులు వేగవంతం అవుతాయాని ట్రైని డిప్యుటీ కలెక్టర్ లు అనూష రవి తేజ సూర్యాపేట ఆర్డిఓఆర్ మాధవ రావు రైతులతో జరిపిన గ్రామ సభలో మాట్లాడారు. రైతులకు జి ఓ నెంబర్ 120 ప్రకారం 46 ఎకరాల 33 గుంటల భూమిని సేకరించడం జరుగుతుందని ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరానికి 21లక్షలు మొదలుకొని 25 లక్షల లోపు నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రతి పాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు.
ఎస్ఆర్ఎస్పి పేజ్ 2లోని డిబిఎం 71 గా పనులు చేయడం జరుగుతుందని ఎకరానికి 28 లక్షలు కావాలని రైతుల నుంచి వచ్చిన ప్రతి పాదనను ప్రభుత్వానికి నివేదించునున్నట్లు చెప్పారు. రైతులందరు కలిసి కట్టుగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఇ సుస్మా, గ్రామ సర్పంచ్ గుండ్ల చంద్ర కళా, తహసీల్దార్ యం. వెంకన్న, డి టి పుష్ప, ఆర్ ఐ లు కర్ణాకర్ రెడ్డి, రమేష్, జి పి ఓ లు వెంకన్న, జాహింగీర్, ప్రసాద్, రమేష్, మల్లయ్య, రైతులు లక్ష్మా రెడ్డి, శ్రీనివాస్, శైలెందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.