calender_icon.png 13 January, 2026 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ స్థాయి క్రీడా పోటీలు

13-01-2026 08:33:40 PM

మోతే,(విజయక్రాంతి): మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన టార్చి ర్యాలీలో పాల్గొన్న ఎంపీడీఓటీ ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 17 న మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో అండర్ 18 సియం కప్ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకొని క్రీడాల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గ్రామాలలో ఉన్న విద్యార్థులు యువకులు వ్యసనాల బారిన పడకుండా పండుగ వేల క్రీడల వైపుగా పయనించి చక్కగా ఆరోగ్యం గా ఉండాలానే సంకల్పంతో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 22 న మండల స్థాయి క్రీడలు నామవరం గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయులు ఆయా గ్రామాల కార్యదర్శిలు  తదితరులు పాల్గొన్నారు.