26 April, 2026 | 4:27 PM

సంక్షేమ హాస్టలలో వసతులు కల్పించాలి

09-12-2024 06:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించి వసతులు కల్పించాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ వైజాగ్ అమ్మకు వినతి పత్రం అందజేశారు. సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నాణ్యతలేని భోజనం అమలు చేస్తున్నారని చలికాలంలో చల్లని నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు అదనపు కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రిజ్వాన్ అహ్మద్, ముసుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.