పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ప్రాణాధారం
జంగా నరసింహారెడ్డి అధ్యక్షులు మధిర స్విమ్మర్స్ అసోసియేషన్
మధిర, జూన్ 5 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ప్రాణాధారమని మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మధిర ట్యాంక్బ్ంప మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ప్రతి ఇంటా కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లపోతు ప్రసాదరావు, మహంకాళి వెంకట శ్రీనివాసరావు, లింగంపల్లి అప్పారావు, ఆదూరి అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.






