సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ పోరు బహిర్గతం!
- ఒకే వేదికపై రెండు వర్గాలు.. ఎగువ మానేరు సాక్షిగా విభేదాలు..
- సస్పెండ్ చేసేదొకరు.. వెంట తిప్పుకునేది మరోకరు..?
- కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ సంగీతం శ్రీనివాస్
గంభీరావుపేట, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద జరిగిన సంఘటనలు ఈ విభేదాలను బహిర్గతం చేశాయి. ఒకే పార్టీలోని నాయకులు వర్గాలుగా విడిపోయి వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ వ ర్గాల్లో చర్చనీయాంశమైంది.
బుధవారం న ర్మాల ఎగువ మానేరు వద్ద గంగమ్మ తల్లికి నిర్వహించిన పూజా కార్యక్రమం ఈ విభేదాలకు ప్రతీకగా నిలిచింది. మొదటగా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్, జిల్లా కార్యదర్శి బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నా రు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గ కాం గ్రెస్ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి తన వర్గం నాయకులతో కలిసి అదే ప్రదేశంలో గంగమ్మకు వేరుగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ-తిరుపతి, రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు, మాజీ మండల అధ్యక్షుడు హమీద్ తదితరులు పాల్గొన్నారు.ఇటీవల మండల అధ్యక్షుడి నియామకంపై అసంతృప్తితో కొందరు నాయకులు పార్టీకి వ్యతి రేకంగా ప్రెస్ మీట్ నిర్వహించగా, జిల్లా అ ధ్యక్షుడు నలుగురు నాయకులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారు కేకే మహేందర్ రెడ్డి వర్గానికి చెందినవారే కావడంతో, వారు మానేరు వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం మరింత చర్చనీయాంశమైంది.
ఒకే కార్యక్రమాన్ని రెండు వర్గాలు విడిగా నిర్వహించడం పార్టీ అంతర్గత విభేదాలను స్పష్టంగా బయటపెట్టింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపాన్ని తెలియజేస్తున్నాయనిపార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. నాయకుల మధ్య విభేదాలు కొనసాగితే పార్టీ బలహీనపడే అవకాశం ఉందని, రాబోయే రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపవచ్చని సూచి స్తున్నారు.
పార్టీ శ్రేణులు మాత్రం విభేదాలను పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు సా గాల్సిన అవసరం ఉందని,లేకపోతే ఈ గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మరిం త నష్టం కలిగించే ప్రమాదం ఉందని పార్టీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






