7 August, 2026 | 2:30 AM

జెన్- జీ దేశ వ్యతిరేకులు కాదు

07-08-2026 01:22 AM

నేటి యువకులు ఎంతో నిజాయితీపరులు

  1. వారిపై నాకు గుడ్డి నమ్మకం ఉంది
  2. పరస్పర గౌరవంతో చర్చించుకున్నప్పుడే సమస్యలకు పరిష్కారం
  3. ముంబై సదస్సులో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

* ఒకవేళ జెన్-జెడ్ ఆందోళనలు చేస్తుంటే, వారు కచ్చితంగా దేశ వ్యతిరేకులు కాదు. వారు మనవారే. మన భావితరానికి ప్రతినిధులు. ప్రస్తుతతరం కంటే యువత ఎంతో నిజాయితీపరులు. వారిపై నాకు గుడ్డిగా.. అపారమైన నమ్మకం ఉంది. ఇరుపక్షాలు ఒకరి అభిప్రాయాలను ఒకరు వినేలా అర్థవంతమైన చర్చలు జరగాలంటే కరుణ, అవ గాహన, పరస్పర గౌరవం అవసరం. సమాజాన్ని చట్టం శాసించదు. సమాజమే చట్టాన్ని శాసిస్తుంది. దేశ బడ్జెట్‌లో 6%  విద్యారంగానికే కేటాయించాలి. 

ముంబై, ఆగస్టు 6 : దేశంలోని యువతరానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎ స్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ మద్దతు తెలిపారు. ఆందోళనలు, నిరసనలు చేపట్టినంత మాత్రాన యువతను (జెన్- జీ) దేశ వ్యతిరేకులుగా పరిగణించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. వారు మన సంతతి అని, మన తర్వాతి తరమని పేర్కొన్న ఆయన, వారి ఆందోళనలను తప్పకుండా పరిష్కరించాలని స్పష్టంచేశారు.

గురువారం ముంబైలో జెన్- జీ, జెన్- ఆల్ఫా యువకుల తో నిర్వహించిన సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు. నేటి యువత, ముఖ్యంగా జెన్- జీ, జెన్ -ఆల్ఫా తరాల వారు ఎంతో నిజాయతీపరులని, వారిపై తనకు గుడ్డిగా.. అపారమైన నమ్మకమున్నదని భగవత్ అన్నారు. ఇరుపక్షాలు ఒకరి అభిప్రాయాల ను ఒకరు వినేలా అర్థవంతమైన చర్చలు జరగాలంటే కరుణ, అవగాహన, పరస్పర గౌరవం అవసరమని నొక్కిచెప్పారు.

యువ త ఏదైనా విషయంపై గళంమెత్తుతోందంటే, అది వ్యతిరేకత కోసం కాదని, వ్యవస్థలో మెరుగుదల కోసమేనని భావించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో తమ గళా న్ని వినిపించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, యువత నిరసనలు చేయవద్దని తాను చెప్పడం లేదని వివరించారు. తమ కాలంలో పెద్దల మాటకు ప్రాధాన్యం ఇచ్చేవారమని, అయితే నేటి జెన్- జీ ప్రతి అంశా నికి తార్కిక వివరణలు, సమాధానాలు కోరుకుంటోందన్నారు.

విద్యార్థులు ప్రశ్నించడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, నిరసనలు తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కులేనని చెప్పుకొచ్చారు. ఇటీవల నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థులు దేశవ్యాప్తంగా భారీఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నిరసన లు చేస్తున్నారనే కారణంతో జెన్- జీ యువతను దేశద్రోహులుగా ముద్రవేయడం సరైం ది కాదని ఆయన స్పష్టం చేశారు. యువత లేవనెత్తే సమస్యలను వినడం, పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హితవు పలి కారు. ‘ప్రపంచ ఏకీకరణలో యువత పాత్ర-భారతీయ మార్గం’ అనే అంశం పై జరిగిన ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థుల తో భగవత్ ముఖాముఖి నిర్వహించా రు. విద్య వాణిజ్య కార్యకలాపం కాకూడదని ఆయన చెప్పారు. అందరికి విద్యను అందించడం తలకుమించిన భారం అవుతున్నా, సమాజం కూడా విద్యావ్యాప్తికి బాధ్యత తీసుకోవాలని అన్నారు. దేశ బడ్జెట్‌లో ౬ శాతం విద్యారంగానికే కేటాయించాలని భగవత్ చెప్పారు. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచా రం చేస్తున్న సోషల్ మీడియాను కట్టిడి చేసేందుకు చట్టాలు మాత్రమే సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇన్‌ఫ్లూయన్స ర్లు బాధ్యతగా వ్యవహరించి తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. చట్టాలతో దేనిపైనైనా నిషేధం విధిస్తే, అది పక్కదారిలో అందుబాటులోనే ఉంటుందన్నారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు జెన్ జీ ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా నిలబడాలన్నారు.

ఈ సందర్భంగా ఆయన పాకి స్తాన్, చైనాలతో భారత్ యుద్ధ సమయాలను ఉదహరించారు. పాకిస్తాన్ పౌరులు మన శత్రువులు కారని, మానవత్వం ఎక్కడైనా ఒక్కటేనని చెప్పారు. స్వలింగ సంపర్కు లు సమాజంలో ఉంటారని, వారిని సమాజంలో భాగంగా చూడాలన్నారు. చట్టం ఎప్పుడూ సమాజాన్ని శాసించదని, కాని సమాజమే చట్టాన్ని శాసిస్తుందని చెప్పారు. సదస్సులో యువకులతోపాటు వివిధ రం గాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు.