7 August, 2026 | 3:25 AM

ఆలయాలకు బోనాల చెక్కుల పంపిణీ

07-08-2026 02:36 AM

ఉప్పల్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన బోనాల చెక్కులను గురువారం హబ్సిగూడలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి  ఎం. పరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులకు బోనాల చెక్కులను అందజేసిన ప్రజాప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తోందని తెలిపారు. ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని ఆలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, ఆలయాల అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.