7 August, 2026 | 3:25 AM

ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పిన బైక్

07-08-2026 02:37 AM

విద్యార్థి మృతి, మరొరికి తీవ్రగాయాలు 

సికింద్రాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఘటన కళాశాల విద్యార్థి మృతి చెందాడు. లాల్ బజార్ నుండి డైరీ ఫారం రూట్ లో జరిగిన ఈ ఘటన పలువురిని కలచివేసింది. ఇద్దరు కళాశాల విద్యార్థులు బైక్ పై వెళ్తు మరో టూ వీలర్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది.

ఓవర్ టేక్ చేసే సమయంలో విద్యార్థులు వారి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభానికి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుమలగిరి ఇన్స్పెక్టర్ జె. నాగరాజు ప్రమాద ఘటన పై వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.