7 August, 2026 | 2:41 AM

శరవేగంగా ‘యంగ్ ఇండియా’!

07-08-2026 01:37 AM
  1.    105 నియోజకవర్గాల్లో అత్యాధునిక రెసిడెన్షియల్ సూళ్లు
  2.    86 చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు
  3. రూ.1,144.85 కోట్లు ఇప్పటికే విడుదల  
  4. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా ప్రాంగణాలు
  5. బాలబాలికలకు ఆధునిక వసతులతో క్యాంపస్‌లు

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తీ సుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ని ర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఆధునిక వసతులతో కూడిన విద్యా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో తొలి విడతలో 105 నియోజకవ ర్గాల్లో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నారు. 86 పాఠశాలల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా, మిగిలిన 19 పాఠశాలలకు పరిపాలనా అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరింది. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు వే ర్వురుగా వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. విద్యార్థులను విభజించకుం డా అన్ని వర్గాల వారు ఒకే వాతావరణంలో కలిసి చదువుకునేలా, సమాన అవకాశాలతో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశం తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  యంగ్ ఇండి యా రెసిడెన్షియల్ స్కూళ్లకు రూపకల్పన చేశారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 105 స్కూళ్లు మంజూరు చేశారు. ఆధునిక మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల బోధన, ప్రశాంతమైన వాతావరణంలో వీటిని తీర్చిదిద్దుతున్నారు. 

అత్యాధునిక ప్రమాణాలు

గ్రామీణ విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు రూపకల్పన చేశారు. ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ బోధన, అభ్యసన సౌకర్యాలు, గ్రంథాలయాలు, విశాలమైన డార్మెటరీ హాళ్లు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానాలు, డైనింగ్ బ్లాక్‌లు, బోధన, బోధనేతర సిబ్బందికి నివాసగృహాలతో సుమారు 25 నుంచి 30  ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యా ప్రాంగణాలు రూపుదిద్దుకుంటున్నాయి. 

ప్రస్తుత రేట్ల ఆధారంగా వ్యయ అంచనాలు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,144.85 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఇంజినీరింగ్ డిజైన్లు, ప్రస్తుత రేట్లను ఆధారంగా చేసుకుని నిర్మాణ వ్యయ అంచనాలను రూపొందించారు. గతంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల కంటే తక్కువ ఖర్చుతో ఈ స్కూళ్ల నిర్మాణం సాధ్యమవుతోంది. ఒక్కో స్కూల్‌లో సుమారు 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా రూపకల్పన చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండటంతో వచ్చే విద్యా సంవత్సరానికి యంగ్ ఇండియా పాఠశాలలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

పరిపాలన అనుమతులకు మరో 19 పాఠశాలలు

105 నియోజకవర్గాల్లో ఇప్పటికే 86 పాఠశాలల నిర్మాణాలు వివిధ దశల్లో కొ నసాగుతుండగా, మిగిలిన 19 నియోజకవర్గా లకు సంబంధించిన ప్రక్రియ కూ డా వేగంగా ముందుకు సాగుతోంది. కో రుట్ల, జనగామ, హుజురాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, అలంపూర్, సిద్దిపేట, నర్సా పూర్, సంగారెడ్డి, జహీ రాబాద్, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, సూర్యాపేట, ఉప్పల్, బాల్కొండ, నిజామాబాద్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల స్కూళ్లకు సంబంధించి అంచనాల ను సిద్ధం చేసి, పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి  సమర్పించా రు. అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.