అనురాగ్‌లో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
ఘట్ కేసర్, జూన్ 23 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం ఆధ్వర్యంలో డీప్ లర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ విస్డం ఇన్ న్యూరల్ నెట్వర్క్ అనే అంశంపై మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ఐ-బ్లాక్లో ఘనంగా ప్రారంభించారు.
ఈకార్యక్రమాన్ని డాక్టర్ మల్లికార్జున రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, ఏఐ విభాగం, కన్వీనర్ విక్టర్ డేనియల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏఐ విభాగం, కో-కన్వీనర్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. ఈ ఎఫ్ డిపి ద్వారా అధ్యాపకుల కు కృత్రిమ మేధస్సు, డీప్ లెర్నింగ్ జనరేటివ్ ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో ఆధునిక పరిజ్ఞానం ప్రాయోగిక అవగాహన కల్పించడం లక్ష్యం గా పెట్టుకున్నారు.
ప్రారంభ ముఖ్య వక్తగా డాక్టర్ విజయేందర్ బూసిరెడ్డి, శాస్త్రవేత్త, ఇస్రో పాల్గొని ఇంటలిజెంట్ రిమోట్ సం సింగ్ ఫ్రం డీప్ లర్నింగ్ మోడల్స్ టు ఎడ్జ్ డిప్లయ్మెంట్ అనే అంశంపై విశేష ఉపన్యా సం అందించారు. ఈప్రారంభ కార్యక్రమం లో కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సిం గ్, ఇతర విభాగాలకు చెందిన సుమారు 130 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.






