24 June, 2026 | 1:46 AM

పల్స్ పోలియో కార్యక్రమాలను విజయవంతం చేయాలి

24-06-2026 12:59 AM

ఎంపీడీవో వి.ప్రవీణ్ కుమార్

శంకర్ పల్లి,జూన్ 23.(విజయక్రాంతి): ఈనెల 28, 29, 30 తేదీలలో శంకర్ పల్లి మండలంలోని గ్రామాలలో, మున్సిపల్ ప్రాంతాలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యశాల సిబ్బంది విజయవంతం చేయాలని ఎంపీడీవో వి. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి టీచర్స్ లకు, మండల స్థాయి సమావేశం ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈనెల 28 తేదీన 36 బూతులలో పోలియో చుక్కలు పోలియో చుక్కలు0-5 సంవత్సరముల చిన్నారులకు వేయడం జరుగుతుందని తెలిపారు.మిగిలిపోయిన వారికి 29, 30 తేదీలలో ఇంటింటికి వెళ్లి వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ రేవతి రెడ్డి, ఎంపిఓ గిరిరాజు, ఏపీవో నాగభూషణం, ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్, ఆశ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.