02-06-2025 01:16:22 AM
కామారెడ్డి, జూన్ 1 (విజయక్రాంతి), కామారెడ్డి పట్టణ పరిధిలోని పాత రాజంపేటలో ఆదివారం బోనాల కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. టేక్ రియల్ గ్రామంలో బోనాలను గ్రామస్తులు ఊరేగించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని ర్యాలీగా పోచమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.