04-02-2026 12:48:43 AM
ఉప్పల్ ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : సరైన వైద్యా అర్హత లేకుండానే ఫస్ట్ ఎయిడ్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యుని అరెస్ట్ చేసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... గుంటూరు జిల్లా కు చెందిన వెంకటకృష్ణ బీఎస్సీ నర్సింగ్ చదువును ఆర్థిక ఇబ్బంది కారణంగా చదు వు మధ్యలో వదిలేసి మాచర్లలో ఓ రిటైర్డ్ డాక్ట ర్ వద్ద కాం పౌండర్‌గా పని చేశాడు.
దీంతో వైద్య పరిజ్ఞానం ఉండడంతో మల్లాపూర్ భవాని నగర్‌లోని ఫస్ట్ ఎయిడ్ క్లీనిక్ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించాడు. ఎలాంటి అనుమతు లు లేకుండా వైద్యని నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నాచారం పోలీసులు ఆసుప త్రిపై దాడులు నిర్వహించి కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.