1 June, 2026 | 6:31 AM

గచ్చిబౌలిలో నకిలీ విదేశీ మద్యం రవాణా గుట్టురట్టు

08-01-2026 12:30 PM

ఇద్దరు అరెస్ట్ 139 నకిలీ విదేశీ మద్యం సీసాలు స్వాధీనం

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నకిలీ విదేశీ మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 139నకిలీ మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్న ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెపిహెచ్బికి చెందిన దేశిని ప్రకాశ్ గౌడ్(29), గద్వాల్ భరత్(32) అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారంతో గచ్చిబౌలిలో గస్తీ నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి నకిలీ మద్యం సీసాలు 46 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

బార్నేస్ బీర్ కంపెనీలో సేల్స్ రెప్రెజెంట్ గా పనిచేస్తున్న ప్రకాశ్ గౌడ్ తో కలిసి భరత్  ఖాళీ విదేశీ మద్యం బాటిల్లను సేకరించి అందులో కల్తీ మద్యం నింపి సీలు వేసి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలిందని, వారు తెలిపిన వివరాలతో వారి నివాసాలలో సోదాలు చేయగా మరో 136 ఖాళీ బాటిల్లు లభించాయని పేర్కొన్నారు.