calender_icon.png 26 November, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

26-11-2025 02:46:06 PM

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ కలకలం సృష్టించాడు. తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. శశికాంత్ అనే వ్యక్తి గత రెండు ఏళ్లుగా ఫిల్మ్ నగర్ లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాను స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ, తన దగ్గర్ ఇద్దరు గన్ మెన్లను పెట్టుకుని బిల్డర్లకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు ఇప్పిస్తానని పలువురు బిల్డర్లను నమ్మించి వసూళ్లకు పాల్పడ్డాడు. ప్రాజెక్టులు ఇప్పించకపోవడంతో పలువురు బిల్డర్లు నిలదీయడంతో సదరు నకిలీ ఐపీఎస్ అధికారి తన గన్ మెన్లతో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ ఐపీఎస్ అధికారి బండారం బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని శశికాంత్ నకిలీ ఐపీఎస్ అధికారి అని గుర్తించి అరెస్టు చేశారు.