07-01-2026 12:41:28 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రంగా వేల మందిని ముంచిన భారీ ఆర్థిక కుంభకోణం ఫాల్కన్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుం ది. డిజిటల్ డిపాజిట్లు, అధిక వడ్డీల పేరుతో సుమారు రూ.850 కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పరారైన ప్రధాన నిందితుడు, ఫాల్కన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. స్కామ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి విదేశాల్లో తలదాచుకున్న అమర్‌దీప్.. తిరిగి భారత్‌లో అడుగుపెట్ట గానే పోలీసులకు చిక్కాడు.
డిపాజిటర్ల సొమ్ముతో బోర్డు తిప్పేసిన వెంటనే అమర్‌దీప్ తన భార్యతో కలిసి దుబాయ్‌కు పారిపోయాడు. తెలంగాణ సీఐ డీ పోలీసులు నిందితుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇన్నాళ్లు విదేశాల్లో తలదాచుకున్న అమర్‌దీప్.. తాజాగా ఇరాన్ నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాడు. లుకౌట్ నోటీసులు ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న తెలంగాణ సీఐడీ ప్రత్యేక బృందం హుటాహుటిన ముంబై వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తరలించింది.
ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ పేర మోసం
ఫాల్కన్ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట కొత్త తరహా మోసానికి తెరతీసింది. అమర్‌దీప్ దీనికోసం ప్రత్యేకంగా నకిలీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లను రూపొందించా డు. ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలతో తమకు ఒప్పందాలు ఉన్నట్లు ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టించి డిపాజిటర్లను నమ్మించాడు. షేర్ మార్కెట్, డిజిటల్ డిపాజిట్ల పేరుతో తక్కువ కాలంలోనే భారీ లాభాలు ఇస్తామని ఆశచూపి సామాన్యుల నుంచి వందల కోట్లు వసూలు చేశాడు. తీరా గడువు ముగిశాక డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేశాడు.
11 మంది అరెస్ట్.. ఆస్తుల సీజ్
ఈ భారీ స్కామ్‌ంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బాధితులు ఉన్నారు. దాదాపు 7,056 మంది డిపాజిటర్లు ఉండ గా, ఇప్పటివరకు 4,065 మంది తాము మోసపోయామని ఫిర్యాదు చేశారు. అమర్‌దీప్ సోదరుడు, సంస్థ సీఈవో, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్లు కలిపి ఇప్పటివరకు మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అమర్‌దీప్‌తో కలిపి మొత్తం 11 మం దిని అరెస్ట్ చేశారు.
అమర్‌దీప్ ఏ1, ఎండీ, ప్రధాన సూత్రధారి, సందీప్ కుమార్, అమర్‌దీప్ సోదరుడు ఆపరేషన్స్ హెడ్, యోగేం ద్ర సింగ్, కంపెనీ సీఈవో,ఆర్యన్ సింగ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కావ్య నల్లూరి, డైరెక్టర్, పవన్ కుమార్ ఓదెల, వైస్ ప్రెసిడెంట్, శరద్ చంద్ర తోష్నివాల్, చార్టర్డ్ అకౌంటెంట్, రవి కుమార్, నిందితులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి, వీరితో పాటు మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు, భారీగా నగదు, బంగారం, షేర్లను సీజ్ చేసినట్టు అధికారులు వివరించారు. అమర్‌దీప్ అరెస్టుతో ఈ కేసులో ఇంకెవరెవరి హస్తం ఉందనేది విచారణలో తేలనుంది.