calender_icon.png 8 January, 2026 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లు కూల్చివేతపై బాధితుల ఆందోళన

07-01-2026 12:41:08 AM

మంథని జనవరి 6(విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారం పేట గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రామగుండం ఓసిపి-2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం భూసేకరణ పనులను ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇందు కూర్చి వేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడే ఉండి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపిస్తూ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించే లేదని వారు ఆందోళన చేశారు. వీరి ఆందోళన కారణంగా మంథని పెద్దపెల్లి రహదారిపై భారీగా వాహనాలతో స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరిఖని 1-టౌన్, 2-టౌన్ సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్ రావు, ఎస్త్స్రలు శ్రీనివాస్, దివ్య తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చేర్చించారు.

అయినప్పటికీ బాధితులు తమ ఆందోళన విరమించకపోవడంతో గోదావరిఖని ఏసిపి మడత రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో చర్చలు జరిపి బాధితులను శాంతింప చేశారు. తమ సమస్యలను ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలు పాల్పడడం సమంజసం కాదని కూల్చివేతపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేశారు.