17 June, 2026 | 11:41 PM

బీజేపీ నాయకులపై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలి

23-03-2026 12:00 AM

చండూరు, మార్చి 22 : కాంగ్రెస్ నాయకులు ఇటీవల జరిగిన దాడులపై  బిజెపి నాయకులపై చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని  అని బిజెపి రాష్ట్ర నాయకులు కోమటి  వీరేశం, జిల్లా నాయకులు అనపర్తి యాదగిరిలు అన్నారు. ఆదివారం అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు  ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, పట్టణ అభివృద్ధికి కృషిచేసి ఆదర్శమైన పాలన అందించాలి తప్ప చిల్లర రాజకీయాలు, గొడవలు చేయకూడదని అన్నారు. 

పార్టీలు మారుతూ.. రకరకాల  పార్టీలో ఉంటూ పబ్బం గడుపుతున్నారు. ఒక పెద్ద మనిషిగా, 30 ఏండ్ల రాజకీయం ఉన్న వ్యక్తి వి నువ్వు ఒక చిన్న గొడవను ఎలా ప్రేరేపిస్తావని ఆరోజే  చిన్న గొడవ అంటూ  వదిలేస్తే వెళ్ళిపోయేదని , కానీ కేసు దాక తీసుకొచ్చింది కాంగ్రెస్ నాయకులే అన్నారు. మద్యం,డబ్బు ఇచ్చి  గొడవలకు దారి తీస్తున్నారు అన్నారు.

ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు వార్డులలో రెండో స్థానంలో ఉందని, అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. గతంలో మాజీ సర్పంచ్గా గిరిబాబు  పరిపాలనలో చిల్లర గొడవలు ఎన్నో ఉన్నాయి అన్నారు. మళ్లీ  మున్సిపల్ పట్టణంలో  మళ్లీ గొడవలు పునరావృతం  అవుతున్నాయి అన్నారు. ఇలాంటి గొడవలు తక్షణమే మానుకోవాలని  కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.

వాళ్ళ తీరు మార్చుకోకపోతే   తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు   సోమ నరసింహ, పిన్నింటి నరేందర్ రెడ్డి, బూతరాజు శ్రీహరి, దోటీ కిరణ్ , బోడ ఆంజనేయులు, వరికుప్పల యాదగిరి, నకరికంటి లింగస్వామి, పేర్ల గణేష్   తదితరులు పాల్గొన్నారు.