23 March, 2026 | 11:57 AM

అరిబండి శ్రీరామయ్య మృతి సీపీఎంకు తీరని లోటు

23-03-2026 12:00 AM

పాలకవీడు, మార్చి 22  : సీపీఎం సీనియర్ నాయకులు  అరిబండి శ్రీరామయ్య మృతి పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, పాలకీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు. నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో  అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మేడారం సర్పంచిగా, ఎంపిటిసిగా మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, సిపిఎం హుజూర్నగర్ డివిజన్ నాయకునిగా రైతుల సంఘ నాయకులుగా తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎర్రజెండా నీడన అనేక ప్రజా పోరాటాలు ప్రజాసమస్యలు పరిష్కరించిన గొప్ప వ్యక్తిని ఆయన మరణం సిపిఎం పార్టీకి లోటన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముషం నరసింహ, దిద్దగుంట్ల పురుషోత్తంరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.