13-10-2025 11:53:21 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills By-election) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి కర్ణన్ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.షేక్ పేట తాహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 21. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరుగుతుంది. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు గడువు విధించారు. నవంబర్ 11న ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నవంబర్ 16 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డిఇఓ తెలిపారు. కర్ణన్ ఇప్పటికే కార్యాలయాన్ని సందర్శించి, ఆర్‌ఓ, ఏఆర్‌ఓలతో సంసిద్ధతను సమీక్షించారు.