28-05-2025 01:37:33 AM
రాంచీ/చర్ల, మే 27: ఝార్ఖండ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత సీపీఐ మావోయిస్టు కీలక నేత మృతిచెందారు. సోమవారం అర్ధరాత్రి పులామ్ జి ల్లాలోని హైదర్‌నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని సీ తాచువాన్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ని షేధిత సీపీఐ మావోయిస్టు కమాండర్ తులసీ భూనియన్ మృతిచెందినట్లు పేర్కొన్నారు. 15లక్షల రి వార్డు ఉన్న మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, రై ఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన 18మంది మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీ ఎల్‌జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్‌లో చురుగ్గా ఉన్న నలుగురితో సహా 18మంది లొ ంగిపోయారు. వారిలో 10మందిపై గతంలో మొత్తం రూ.38లక్షల రివార్డు ప్రకటించారు. వీరంతా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు లొంగిపోయారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్ రహిత గ్రా మ పంచాయతీ పథకం సాధించిన విజయంగా ఎస్పీ వె ల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు ఆపరేష న్ కగార్ పేరిట మావోయిస్టులను మ ట్టుబెడుతున్న నేపథ్యంలో వీరి లొంగిపోయినట్లు సమాచారం.