10-12-2025 12:29:12 AM
సంగారెడ్డి, డిసెంబర్ 9(విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు ఆశిస్తూ ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురేసి అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా ఏళ్లు గా ఆయా పార్టీ జెండాలను మోసిన వారే కావడం గమనార్హం. అలాంటి వారికి రిజర్వేషన్ కలిసి రావడంతో సర్పంచ్ గా ఎన్నిక వ్వాలని భావిస్తున్నారు. పార్టీల మద్దతును ఆశిస్తున్నారు.
మొదటి, రెండో విడత ఎన్నికలకు సంబంధించిన గుర్తులు కూడా ఖరారు కావడంతో ఇంటింటి ప్రచారం ముమ్మురం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఆశీర్వదిస్తే ముఖ్యనేతల అండతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గెలిపించాలని వేడుకుంటున్నారు.
బహిరంగ మద్దతుకు వెనుకంజ...
ఇలావుండగా బరిలో నిలిచిన అభ్యర్థులు తమ పార్టీ వారైనా.. నిన్న మొన్నటి వరకు తమతోటే తిరిగినప్పటికీ వారికి ప్రధాన పా ర్టీల నాయకులు మద్దతు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. సింగిల్ నామినేషన్ దాఖ లైన గ్రామాల్లోని వ్యక్తులకు ఒకే అంటున్నప్పటికీ.. ఇద్దరు, ముగ్గురేసి అభ్యర్థులు పో టీలో ఉన్న చోట తమ పార్టీ మద్దతు ఫలా నా వ్యక్తికే అని చెప్పేందుకు మాత్రం ముం దుకు రావడం లేదు.
ఒక వ్యక్తికి మద్దతునిస్తే మరో వ్యక్తి దూరమయ్యే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో సదరు అభ్యర్థి గెలుపుకోసం ఆయా గ్రామాలకు ప్రచారానికి వె ళ్లాల్సి ఉంటుందని, కొన్ని చోట్ల ఆర్థికంగానూ అండగా నిలవాల్సి వస్తుందనే ఉద్దే శంతో బహిరంగ మద్దతు ప్రకటించేందుకు ముఖ్యనేతలు వెనుకాడుతున్నారు. సింగిల్ నామినేషన్ దాఖలైన వ్యక్తుల గెలుపుకోసం ఎక్కడో ఓ చోట ఆయా పార్టీల ముఖ్యనేతలు ప్రచారం చేస్తున్నారు.
ఇతర గ్రామాల్లో మాత్రం మద్దతుపై స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఒకరికి మద్దతు ప్రకటిస్తే.. ఎన్నికల్లో మరో వ్యక్తి గెలిస్తే పార్టీపరంగా నష్టం జరిగే అవకాశముంటుందనే భావనతో మద్దతు ప్రకటనపై ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. మద్దతుదారుల్లో ఎవ రు గెలిచి వచ్చినా అది పార్టీ ఖాతాలోకే చేరుతున్నందున వారికి కండువా కప్పేస్తే సరి పోతుందనే భావనలో పార్టీల ముఖ్యనేతలు ఉన్నట్లుగా సమాచారం.
ఇటీవల ఓ ప్రధాన పార్టీ ముఖ్య నాయకుడిని తమ గ్రామంలో ప్రచారానికి రావాలని ఆహ్వానించగా గెలిచిరావాలని సూచించడం అక్కడున్న వారిలో చర్చనీయాంశంగా మారింది. ఒకరికి మద్ద తు ప్రకటించి మరొకరిని దూరం చేసుకోవడం ద్వారా రానున్న జెడ్పీ ఎన్నికల్లో ప్రభా వం చూపే అవకాశమున్నందున ఆ జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని ఆయా పార్టీల ముఖ్య నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమ ఎన్నికల ప్రచా రానికి పార్టీల ముఖ్య నేతలు వస్తే ఓటర్ల మద్దతు దక్కి గెలుపు సునాయాసమవు తుందని ఆశపడ్డ అభ్యర్థులకు సదరు నేతల తీరుతో నిరాశేఎదురవుతుంది.