10-12-2025 12:29:03 AM
సూర్యాపేట, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికలు ప్రచారం కొనసాగుతున్న సమయంలో పలువురు అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని చివ్వెంల మండలం వల్లభాపురం, జగన్నాయక్ తండ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు మంగళవారం జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలను తట్టుకోలేక పలు పార్టీ నాయకులు టిఆర్‌ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ లోనే అన్ని వర్గాల ప్రజలకు తగులు న్యాయం జరిగిందని నమ్మకంతో టిఆర్‌ఎస్ కు ఆకర్షితులవుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.