10-12-2025 12:30:18 AM
మిర్యాలగూడ, డిసెంబర్ 9 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ దీక్షానుసారం అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంట్ లో ప్రకటించిన రోజును నేటి విజయ్ దివస్”డిసెంబర్’9 కేసిఆర్ దీక్షా విరమించిన రోజు గా పేర్కొంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు.. మంగళవారం మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రం భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం నందు తెలంగాణ తల్లి చిత్రపటానికి పట్టణ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబర్ ’29 న దీక్షా దివస్ కార్యక్రమం ఎలాగైతే విజయవంతం చేసారో అలాగే ఈ రోజు విజయ్ దివస్ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆనాడు కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అందరు అవహేళన చేశారు. ఈ బక్కపలచటి మనిషితో తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వస్తుందని నవ్వారు. కానీ కేసిఆర్ సచ్చుడో.
తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ ’29 న చేపట్టిన దీక్షతో యావత్ భారత దేశాన్ని కదిలించి తెలంగాణ వైపు చూసే విధముగా చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం మేడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసే విధముగా కృషి చేసారు..
తెలంగాణ రాష్ట్ర౦ వచ్చిందంటే కేవలం కేసిఆర్ దీక్షా మాత్రమే కారణమని అన్నారు. అనంతరం భారత రాష్ట్ర సమితి కార్యాలయం నుంచిడాక్టర్.బిఆర్ .అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీ కొ-ఆప్షన్ మెంబర్ ఎండి.మోశిన్ అలీ, అన్నబీమొజు నాగార్జున పాల్గొన్నారు.