పంచాయతీ కార్యదర్శికి ఘనంగా వీడ్కోలు
ములకలపల్లి, (విజయక్రాంతి): జగన్నాధపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ, బదిలీపై వెళ్తున్న షేక్ ఇబ్రహీంకు గ్రామంలో ఘన వీడ్కోలు లభించింది. శనివారం ఆయన సేవలను కొనియాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంజా వినోద్, ఉప సర్పంచ్ జలగం మాధవి మాట్లాడుతూ.... షేక్ ఇబ్రహీం జగన్నాధపురం పంచాయతీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరించారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి బదిలీపై వెళ్తున్న చోట కూడా ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు గ్రామ ప్రజలు పాల్గొని కార్యదర్శి ఇబ్రహీంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.






