30 May, 2026 | 6:44 PM

చర్ల అభివృద్ధికై మంత్రి వాకాటి శ్రీహరితో ఎంఎల్ఏ చర్చ

30-05-2026 06:14 PM

- ప్రత్యేక నిధులు,

- సెంట్రల్ లైటింగ్‌కు హామీ

చర్ల,(విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండల అభివృద్ధి పనులపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకాటి శ్రీహరితో తెల్లం వెంకట్రావు శనివారం సమావేశమయ్యారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రత్యేక నిధుల కేటాయింపు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా చర్ల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన మంత్రి భద్రాచలం నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సెంట్రల్ లైటింగ్‌కు సంబంధించి త్వరలోనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. చర్ల మండల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు చీమలమరి మురళీకృష్ణ, పోలిన లంకరాజు, పొట్రూ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.