పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ
24-04-2026 04:28 PM
కన్నీటి పర్వతమైన విద్యార్థులు
బోథ్,(విజయక్రాంతి) మండలంలోని కౌట(బి )గ్రామ హరిజన పాఠశాలలో ఉపాధ్యాయుడు సాగర్ విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఉత్తములుగా తీర్చి దిద్దుతున్నాడు. అయితే వేసవి సెలవులలో ఇంటికి వెళ్తున్న ఐదవ తరగతి విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. తమకు అన్ని రకాలుగా సహకారం అందించిన ప్రధానోపాధ్యాయుడు సాగర్ దూరం అవుతున్నాడని విద్యార్థులు వాపోయారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు తీసుకొచ్చిన పరీక్ష వ్యాధులను అందించి ఉన్నతులుగా ఎదగాలని కోరారు.






