సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే
* పేదల పెద్దన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండలం చాందూరి, నాగపూర్, ఉట్నూర్ మండల కేంద్రంలోని ఫకీర్ గుట్టలో ఇందిరమ్మ ఇండ్ల గృహ గృహప్రవేశాలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లబ్దిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతి పేదవారి కల నెరవేరుతుంది. మహిళలు ఆర్ధికంగా స్థిరపడుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యార్థులు ఉన్నత విద్య చదువుతూ మంచి భవిష్యత్ వైపు అడుగులు వేస్తున్నారని, మరెన్నో అబివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని, సంక్షేమ పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకం అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ఇందిరమ్మ లబ్దిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






