3 July, 2026 | 8:43 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

4 ఎకరాల వరకు రైతుభరోసా

19-06-2025 12:40 AM
  1. రూ.1,313.53కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ 
  2. --  21.89 లక్షలు..6.33లక్షల మంది రైతులకు లబ్ధి 
  3. ఇప్పటివరకు 58.04లక్షల మంది.. రూ.5,215.26కోట్లు విడుదల 
  4. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతాంగానికి రైతు భరోసా కింద 4 ఎకరాల వరకు రూ. 1,313.53కోట్లను బుధవారం వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 21.89లక్షల ఎకరాలకుగాను 6.33లక్షల మంది రైతులు లబ్ధి పొందారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 58.04 లక్షల మంది రైతులకు గాను రూ. 5,215.26 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతులు ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేశామని వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో ఒక సందర్భంలో మినహా వానాకాలం రైతు బంధు సాయం ఎప్పుడు కూడా సాగుకాలానికి ముం దు ఇవ్వలేదని, ప్రతి ఏటా ఆలస్యంగానే నిధులు విడుదలయ్యేవని, అది కూడా పదో నెల వరకు కొనసాగేదన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో ఏ ఒక్క సందర్భంలోనూ 3 రోజుల్లో రూ. 5వేలకోట్లకు పైగా రైతుబంధు కోసం ఖర్చుపెట్టిన దాఖలాలు లేవన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రైతుల సంక్షేమం కోసం రూ. 77,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.