14 May, 2026 | 1:43 AM

భూతగాదాలతో మనస్థాపం.. రైతు ఆత్మహత్య

14-05-2026 12:00 AM

నంగునూరు, మే 13: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో భూతగాదాల కారణంగా ఆసర్ల కిష్టయ్య (59) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..తన అన్నదమ్ములతో గత కొంతకాలంగా భూమి విషయంలో వివాదాలు నడుస్తున్నాయి.

రెండు రోజుల క్రితం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో మనస్తాపానికి గురైన కిష్టయ్య బుధవారం తెల్లవారుజామున తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజగోపాలపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి గొడవలతో నిండు ప్రాణం బలికావడం తో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.